top of page

ఆరోగ్యమే మహా భాగ్యం

  • Writer: Prashanth kumar Kasoju
    Prashanth kumar Kasoju
  • Mar 5, 2021
  • 1 min read




ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. దీని కోసం రక రకాల పద్ధతులు పాటిస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకూ ఎన్నో రకాల వ్యాయామాలు, మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మరీ అంత ఎక్కువ శ్రమ పడకుండా పండంటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే ఈ చిట్టి పొట్టి చిట్కాలు పాటించి చూడండి.

"పండంటి ఆరోగ్యానికి పది సూత్రాలు"



1). తరచూ ఆహారంలో పాలకూర తీసుకుంటుంటే శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా లభించడంతో పాటు, పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.


2). రోజంతా ఎంత బిజీగా ఉన్నా ఓ 20 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ లేదా రన్నింగ్ చేసినట్టయితే ఒత్తిడి అన్నది అస్సలు దరిచేరదు.


3). పని మనుషుల మీద ఎక్కువగా ఆధారపడకుండా ఇంటి పని స్వయంగా చేసుకుంటే శారీరక వ్యాయామం తో పాటు, క్యాలరీలు కూడా అధికంగా ఖర్చు అవుతాయి.


4). విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు మందుల కన్నా ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. వేడి వేడి టీలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే బాధ నుంచి విముక్తి పొందవచ్చు.


5). కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి రక రకాల పద్దతులు పాటిస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా ఓ చిన్న గిన్నెడు ఓట్స్ ను తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తేలికగా తగ్గించుకోవచ్చు.


6). నీరు తాగడం అన్నది ఆరోగ్యానికే కాదు, అందానికీ కూడా అత్యవసరం. వ్యాయామం చేయడానికి ముందు, ఆ తరువాత కూడా తప్పనిసరిగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.


7). లో బీపి, ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు నిపుణులు సలహా మేరకు క్రమం తప్పకుండా రోజులో కొద్దిసేపన్నా వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం పై సమస్యలకు మందుగా పని చేస్తుంది.


8). వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం, శ్వాస పరమైన సమస్యలు ఎదురైనప్పుడు, వ్యాయామం చేయడం వెంటనే ఆపివేసి, దగ్గరలో ఉన్న డాక్టరును సంప్రదించాలి.


9). చెవి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసి చూస్తే కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. పచ్చి బంగాళాదుంపను చెవిలో కొద్ధిసేపు పెట్టుకుంటే నొప్పి కొంతవరకూ తగ్గుతుంది.


10). ఆహారం బాగా నమిలి, ఎక్కువ సేపు తినడం వలన జీర్ణం కావడంతో పాటు మరో లాభం కూడా ఉంది. ఎక్కువసేపు ఆహారం తీసుకోవడం వలన ఎక్కువగా తిన్నామన్న ఫీలింగు కలుగుతుంది. దాంతో ఎక్కువ సమయంలో తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.


Recent Posts

See All

Comments


download.jpg

About us

i'm prashanth vestige director 

our vestige product atr totally organic just try once 

Join My Mailing List

Thanks for submitting!

© 2023 by Going Places. Proudly created with Wix.com

bottom of page